Header Banner

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

  Sun May 25, 2025 11:03        Others

కేంద్రంలో రాష్ట్రంలో రెండుచోట్ల జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలే కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ పంట పండుతోంది. దీనికితోడు కేంద్రం తెలుగుదేశం పార్టీ ఎంపీలపై ఆధారపడటం కూడా ఒక ప్రధాన కారణమవుతోంది. రైల్వేకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ ఏపీలో పూర్తిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. వీటిల్లో ప్రధానమైన నడికుడి - శ్రీకాళహస్తి, కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్లను సత్వరమే పూర్తిచేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. కోనసీమ మొత్తానికి కీలకమైన కోటిపల్లి - నరసాపురం రైల్వేలైను ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటోంది. ఈ లైను పూర్తయితే మొత్తం కోనసీమ ప్రాంతాన్ని చుట్టేయొచ్చు.

 

18 గ్రామాలమీదుగా సాగుతుండటంతో..
ఈ ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తయింది. 18 గ్రామాలమీదుగా సాగే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతుండటంతో చాలామంది ఇళ్లు కట్టేసుకున్నారు. దీంతో రైల్వే లైన్ అలైన్ మెంట్ ను మార్చాల్సి వచ్చింది. కొత్త రైల్వే లైను 60 కిలోమీటర్లకు పెరిగింది. అయితే పాత మార్గమే కొనసాగించాలని కొందరు అన్నదాతలు కోరుతుండగా, కొత్త మార్గం కొనసాగించాలని మరికొందరు రైతులు కోరుతున్నారు. నడికుడి -శ్రీకాళహస్తి రైల్వే లైనుకు సంబంధించి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పూర్తిగా రైల్వే లైను నిర్మాణం జరుపుకుంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రం పనులు ప్రారంభం కాలేదు.

 

ఇది కూడా చదవండి:  శ్రీవారి సేవల్లో భారీ మార్పులు! ఎన్నారైలకు ప్రత్యేక ప్రణాళికలు!

 

భూమిని అందజేస్తే వెంటనే పూర్తిచేస్తాం
సేకరించాల్సిన భూమి ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు ఆలస్యమవుతూ వస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి తిరుపతికి, విజయవాడ నుంచి చెన్నైకి ప్రత్యామ్నాయ రైల్వేలైనుగా మారుతుంది. ప్రకృతి విపత్తుల సమయంలో ఈ రైల్వేలైను అక్కరకొస్తుంది. వెనకబడిన ప్రాంతాలైన దర్శి, కనిగిరి, పొదిలి లాంటి ప్రాంతాలకు రైల్వే లైను అందుబాటులోకి వస్తుంది. భూసేకరణ విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించగలిగితే సత్వరమే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందంటున్నారు.

 

గుంటూరు-సికింద్రాబాద్ మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనులు కూడా పూర్తయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, సికింద్రాబాద్ నుంచి చెన్నైకి అతి తక్కువ సమయంలో చేరుకునే వీలుంటుంది. అవసరమైనచోట రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సత్వరమే భూమిని అందజేస్తే పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తిచేసి రైల్వే లైనును అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!

 

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 
ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



నేడు (24/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #AndhraPradesh #APRailway #RailwayDevelopment #NewRailwayLines #IndianRailways #ConnectivityBoost #APNews #TransportUpdate